మనం ఎన్నో కష్టాలుతో దేవుని సన్నిధిలో ప్రార్ధించినప్పుడు అయన మన ప్రార్ధనలు విని మనలను ఆదుకొన్నప్పుడు ఆయన మనకు అందచేసిన నిబంధనలు కుడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.ఓ మంచి బాటలో మనం ప్రయాణించాలను,ప్రేమ,ఆప్యాయత,అను
రాగం,పెద్దల పట్ల గౌరవం కలగి నడుచుకోవాలని మోషేతో ఆనాడు సినాయి పర్వతంపై మన కొరకు ఆయన ఆజ్ఞలను తెలియచేసి ఆ క్రమంలో మనలను నచుడుకోవాలని చూచించారు. మరి ఆ విధంగా మనం నచడుచుకొంటున్నామా లేదో మనం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.ఆయన ఆజ్ఞలను మనం మితిమీరినట్లుయితే జరిగే పర్యవస్ధానాలు కుడాఆయన తెలియచేోసారు.ఈ రోజుల పలు కుటుంబాలలో మనశాంతి లేకుండుటకు కారణం ఆయన ఆజ్ఞలను మితిమీరడమే మంచి బాటలో ప్రయాణించక పోవడమే.మన దేవుడు ఆయన రూపంలో మనలను నిర్మించుకున్నాడు.ఎన్నడు మనలను తన చెయ్యి విడువడు. 400 సంవత్సరాలుగా ఎంతో క్షోభ అనుభవించిన ఇజ్రాయేలీయ ప్రజల ఆర్తనాధాలు వినిని దేవాది దేవుడు వారిని ఆదుకొన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి.వారికి బోధించి సత్యాలను మనం గ్రహించాలి.దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించుగాక..హల్లేల్లూయ..ఆమేన్...
0 Comments