బచ్ ఫాన్ అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఇంక్రెడబుల్ ఇండియా అనువల్ డే సంబరాలు రవీంద్ర భారతి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. మలక్ పేట్, షంషీర్ గంజ్, చార్మినార్, దిల్సుక్ నగర్ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్కూల్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ ఇంక్రెడబుల్ ఇండియా అనువల్ డే సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలకు విద్యతోపాటు అన్ని రంగాలపైనా ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలక్ పేట్, షంషీర్ గంజ్, చార్మినార్, దిల్సుక్ నగర్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Here We Are Starting My tv 24X7 Channel For Giving Good News & Entertaining Videos...
Please Subscribe Our YouTube Channel for more News Updates My tv 24X7
0 Comments